![]() |
![]() |
.webp)
బిగ్ బాస్ అగ్ని పరీక్ష షూటింగ్ కి సిద్దమైనట్లు అప్ డేట్స్ ద్వారా తెలుస్తోంది. జడ్జెస్ గా నవాడీపీ, అభిజిత్, బిందు మాధవి ఉన్నారన్న విషయం తెలుస్తోంది. 40 మంది కామన్ మ్యాన్ నుంచి ఈ జడ్జెస్ బెస్ట్ అనుకున్న వాళ్ళను నెక్స్ట్ రౌండ్ కి పంపించబోతున్నారు. అలాగే ఇందులో 25 మంది ఎలిమినేట్ కాబోతున్నారన్న విషయం తెలుస్తోంది. ఇక సెలెక్ట్ ఐన 15 మందిని ముగ్గురు జడ్జెస్ ఒక్కొక్కరు 5 గురిని తీసుకుని వాళ్లకు టాస్కులు ఇచ్చి ఆడించబోతున్నారు. అలాగే నెక్స్ట్ లెవెల్ ఆడియన్స్ పోల్ ఉండబోతోందన్న విషయం తెలుస్తోంది. టాప్ 5 ఓట్స్ తో ఎవరు లీడ్ లో ఉంటారో వాళ్ళే బిగ్ బాస్ సీజన్ 9 వెళ్లారంటూ అప్ డేట్స్ ద్వారా తెలుస్తోంది.
అగస్ట్ 22 నుంచి ఈ అగ్నిపరీక్ష స్టార్ట్ కాబుతోంది. ఇక కామన్ మ్యాన్ క్యాటగిరి కంటెస్టెంట్స్ కి జడ్జెస్ కొన్ని టాగ్స్ తో బడ్జెస్ కూడా ఇవ్వబోతున్నారు. బ్యాడ్జ్ ఆన్ హోల్డ్, బ్యాడ్జెస్ ఆల్మోస్ట్ ఒకే, బ్యాడ్జిస్ సెలెక్టెడ్ ఫర్ లెవెల్ 2 ఇలా ఇవ్వబోతున్నారు. అలాగే 0 బ్యాడ్జ్ అంటే స్పాట్ ఎలిమినేషన్ కూడా ఉండబోతోందన్నమాట. ఇక ఈ టాస్కుల్లో ఆల్రెడీ కొంతమంది ఎలిమినేటెడ్ కంటెస్టెంట్స్ పేర్లు కూడా తెలుస్తున్నాయి. యాంకర్ మల్లేశ్వరి, మొహమ్మద్ సమీర్, ట్రాన్స్జెండర్ అంకిత, దమ్ము శ్రీరాజ్ వంటి వాళ్ళు ఎలిమినేట్ అయ్యారన్న విషయం తెలుస్తోంది.
![]() |
![]() |